Tuesday, September 17, 2024

ఆధార్ పివిసి కార్డు..సులభంగా ఇలా అప్లై చేసుకోండి!

- Advertisement -
- Advertisement -

ఆధార్ పివిసి కార్డు అంటే ఏటీఎం వలె, డెబిట్-క్రెడిట్ కార్డు వలె ఉంటుంది. దీనిని జేబులో సులభంగా పెట్టుకోవచ్చు. అయితే, ఆధార్ పివిసి కార్డు పౌరులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా అందించబడుతుంది. ఇది ఒక ప్లాస్టిక్ కార్డు వలె ఉంటుంది. ఆధార్ పివిసి కార్డు పేపర్ లామినేటెడ్ ఆధార్ కార్డు కంటే ఆధార్ పివిసి కార్డు బలమైనది. ఈ కార్డు నీటిలో నానిపోదు, జేబులో వంగిపోదు. ఆధార్ పివిసి కార్డును ఎవరైనా ఆధార్ కార్డ్ హోల్డర్ పొందవచ్చు. ఈ ప్లాస్టిక్ కార్డు పొందడానికి పౌరుల నుంచి రూ.50 రుసుము వసూలు చేస్తారు. కాగా మీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌ల ద్వారా ఆధార్ పివిసి కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ఆధార్ పివిసి కార్డు ఎలా అప్లై చేయాలి?

1. ముందుగా మీరు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్ళాలి.
2. ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత మై ఆధార్ విభాగానికి వెళ్ళండి.
3. తర్వాత మీరు ఆర్డర్ ఆధార్ పివిసి కార్డు ఎంపికపై క్లిక్ చేయాలి.
4. ఇప్పుడు ఆధార్ కార్డు హోల్డర్ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.
5. తర్వాత మీరు తదుపరి ప్రాసెసింగ్ కోసం క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.
6. ఇప్పుడు ఫోన్ నంబర్ వివరాలను నమోదు చేసి,సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయండి.
7. ఇప్పుడు మీరు మీ స్క్రీన్‌పై పివిసి కార్డు ప్రివ్యూని చూస్తారు.
8. మొత్తం సమాచారాన్ని తనిఖీ చేసిన తర్వాత, మీరు చెల్లింపు చేసి కార్డును ఆర్డర్ చేస్తే సరిపోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News