Friday, November 22, 2024

PAN-Aadhaar Link: మీ ఆధార్‌తో పాన్ కార్డు లింక్ అయిందా, లేదా… తెలుసుకోవడం ఎలా?

- Advertisement -
- Advertisement -
2023 మార్చి 31 నాటికల్లా మీ పాన్ కార్డుతో ఆధార్‌ను లింక్ చేసుకోవాలి! ఇక ఆ స్టేటస్ తెలుసుకోవడం ఎలా?…

ముంబై: పర్మనెంట్ అకౌంట్ నంబర్(పాన్)తో ఆధార్‌ను తప్పనిసరి లింక్ చేసుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆదేశించింది. దీనికి 2023 మార్చి 31 తుది గడువు. అలా చేయకపోతే మీ పాన్ నంబర్ పనిచేయకుండా పోతుంది(ఇన్‌యాక్టివ్ అవుతుంది). దానివల్ల మీరు బ్యాంకు సేవలు పొందలేరు. అలాగే ఎన్‌ఎస్‌ఈ, బిఎస్‌ఈ వంటి స్టాక్ ఎక్స్‌ఛేంజీలలో లావాదేవీలు నిర్వహించలేరు.

తమ పాన్ కార్డుతో ఆధార్‌ను లింక్ చేయని పన్ను చెల్లింపుదారులు రూ. 1000 లేట్ ఫీజుగా చెల్లించి ఇప్పుడైనా లింక్ చేసుకోండి. లేకుంటే కష్టం. పెనాల్లీ లేకుండా లింక్ చేసే తుది గడువు 2022 జూన్ 30తోనే ముగిసిపోయింది. కనుక ఇప్పటికైనా లేట్ ఫీజుతో లింక్ చేసుకోండి. పాన్ కార్డుతో ఆధార్ లింక్ అయింది లేనిది స్టెప్‌బై స్టెప్ ఇలా తెలుసుకోండి.

మొదట ఇన్‌కమ్ ట్యాక్స్ ఈఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లండి.

మొదటి స్టెప్: ఈ లింక్‌కు వెళ్లండి.
https://www.incometax.gov.in/iec/foportal/

రెండో స్టెప్: ఈ పేజీలో ఎడమవైపు ‘క్విక్ లింక్స్’ కనబడుతుంది. అక్కడ ‘లింక్ ఆధార్ స్టేటస్’ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.

మూడో స్టెప్: మీ 10 సంఖ్యల పాన్ నంబర్‌ను ఎంటర్ చేయండి. అంతేకాకుండా 12 సంఖ్యల ఆధార్ నంబర్‌ను కూడా ఎంటర్ చేయండి. ఆ తర్వాత ‘వ్యూ లింక్ ఆధార్ స్టేటస్’ను క్లిక్ చేయండి.

ఒకవేళ మీ ఆధార్ ఇదివరకే లింక్ అయి ఉంటే, ఆధార్ నంబర్ కనిపిస్తుంది. ఒకవేళ ఆధార్ లింక్ అయి ఉండకపోతే మీరు లింక్ చేయడానికి అవసరమైన స్టెప్స్ పూర్తిచేయాల్సి ఉంటుంది.
ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా మీరు పాన్‌ఆధార్ లింక్ అయింది లేనిది స్టేటస్ తెలుసుకోవచ్చు. అందుకు మీరు 567678 లేక 56161కు ఎస్‌ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. అందుకు మీరు UIDPAN (స్పేస్) 12 సంఖ్యల ఆధార్ నంబర్ (స్పేస్)తర్వాత మీ పాన్ నంబర్ టైప్ చేసి 567678కి లేదా 56161కి ఎస్‌ఎంఎస్ చేయాలి.

ఎస్‌ఎంఎస్ ఇలా ఉండాలి: UIDPAN <12 digit Aadhaar number> <10 digit Permanent Account Numer>

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News