Sunday, December 22, 2024

మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలీదా? ఇలా తెలుసుకోండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. బూత్ లెవల్ ఆఫీసర్లు (బిఎల్‌ఓ) ప్రతి ఇంటికి వెళ్లి ఫిజికల్‌గా ఓటర్లకు స్లిప్పుల పంపిణీ చేశారు. కొందరు ఓటర్లు ఇళ్లు మారడం, మరే ఇతర కారణాలతో పోలింగ్ స్లిప్పులు అందకపోవచ్చు. అలాంటి వాళ్లు స్మార్ట్ ఫోన్లోతో పోలింగ్ స్టేషన్ వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా, హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా, మొబైల్ ఎస్‌ఎంఎస్ ద్వారా పొందడానికి ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది.

ఓటరు గుర్తింపు కార్డు నెంబర్‌ను టైప్ చేసి 1950 లేదా 9211728082 అనే నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపితే వివరాలు వస్తాయి. ఆన్‌లైన్ అయితే.. www.ceotelangana.nic.in అనే వెబ్‌సైట్‌లో సెర్చ్ యువర్ నేమ్ -అసెంబ్లీ- ఓటర్స్ సర్వీస్ పోర్టల్ మెనూ ద్వారా ఓటరు గుర్తింపు కార్డు లేదా మొబైల్ నెంబర్ లేదా పేరును ఇవ్వడం ద్వారా ఏ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయవచ్చో తెలుసుకోవడంతో పాటు డిజిటల్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

www.voters.eci.gov.in అనే వెబ్‌సైట్‌లో సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అనే ఆప్షన్‌ను సెలెక్టు చేసి వ్యక్తుల వివరాలను పొందుపర్చడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో 24 గంటలు పనిచేసే హెల్ప్ లైన్ (టోల్-ఫ్రీ) నెంబర్ 1950కి ఫోన్ చేసి ఓటర్ల వివరాలను లేదా ఓటరు గుర్తింపు కార్డు నెంబర్‌ను తెలియజేయడం ద్వారా కూడా పోలింగ్ కేంద్రం, బూత్, నెంబర్ తదితరాలను పొందవచ్చు.

ఎన్నికల సంఘానికి మెయిల్ (complaints@eci.gov.in) ద్వారా కూడా మన గ్రీవెన్స్ (ఫిర్యాదు)ను ఇచ్చి పోలింగ్ బూత్ వివరాలను తిరిగి మెయిల్ ద్వారా పొందవచ్చు.

www.electoralsearch.eci.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా ఇవే వివరాలను పొందుపర్చి ఓటర్ డిజిటల్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ వినియోగదారులు యాప్ స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అనే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వివరాలను ఇవ్వడం ద్వారా ఏ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేయవచ్చో తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

ఓటు వేయడానికి ఏమేం తీసుకెళ్లాలి అంటే.. ఫోటో ఓటరు స్లిప్పు, ఫోటో గుర్తింపు కార్డు, ఆదార్ కార్డు, పాసుపోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు, పోస్టాఫీసు పాసుబుక్, పాన్ కార్డు, జాబ్ కార్డు, ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, వృద్దులు ఫొటోతో జత చేసిన పింఛను పత్రాలు వీటీల్లో ఏదైనా గుర్తింపు పత్రంగా తీసుకెళ్లి పోలింగ్ స్టేషన్ లో చూపించి ఓటు వేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News