Saturday, January 18, 2025

పోలింగ్ స్టేషన్, బూత్‌ను కనుగొనడానికి వెబ్‌సైట్…

- Advertisement -
- Advertisement -

ఓటర్లు తమ పోలింగ్ బూత్‌ను కనుగొనడానికి electoralsearch.inకి వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. లేదా ఓటర్ హెల్ప్‌లైన్ నంబర్ 1950కి కాల్ చేసి అడగవచ్చు. పోలింగ్ స్టేషన్కు వెళ్లే ముందు ఓటర్ ఐడీ లేదా ఇతర ఫొటో గుర్తింపు కార్డులు, ఓటర్ స్లిప్ మీ వద్ద ఉంచుకోవాలి. మీ ఇంటి వద్దకే వచ్చి ఓటర్ స్లిప్ ఇచ్చి వెళతారు. ఒక వేళ మీకు ఓటర్ స్లిప్ ఇవ్వకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

పోలింగ్ బూత్ కౌంటర్‌లో రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్ల వద్ద పొందవచ్చు. పోలింగ్ స్టేషన్లో మెుదటి అధికారి ఓటరు జాబితాలో, గుర్తింపు కార్డులో మీ పేరును పరిశీలిస్తారు. మరో అధికారి మీ వేలికి ఇంక్ అంటిస్తారు. ఆ తర్వాత ఓ చీటీ ఇస్తారు. మూడో అధికారి ఆ చీటిని చెక్ చేస్తారు. అప్పుడు మీరు ఓటు వేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రిసైడిండ్ అధికారి, పోలింగ్ అధికారి బటన్ నొక్కడం ద్వారా ఈవిఎం యంత్రంపై మీరు ఓటు వేసేందుకు అనుమతిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News