Tuesday, November 5, 2024

ఎల్‌ఐసి పాలసీతో పాన్ లింక్ ఎలా?

- Advertisement -
- Advertisement -

How to link PAN with LIC policy

న్యూఢిల్లీ : ఎల్‌ఐసి పాలసీదారులు ఐపిఒ కొనుగోలు చేయాలన్నా లేదా అప్‌డేట్ కోసం పాన్‌తో అనుసంధానం చేసుకావాల్సి ఉంటుంది. ఇప్పటికీ ఎల్‌ఐసి పాలసీతో పాన్ కార్డ్‌ని లింక్ చేయకుంటే, తప్పకుండా చేసుకోండి. లేకపోతే భవిష్యత్‌లో సమస్యలు తలెత్తే అవకాశముంది. పాన్ కార్డ్‌ని ఎలా లింక్ చేయవచ్చో తెలుసుకుందాం.

ఎల్‌ఐసితో పాన్ లింక్

ముందుగా LIICIndia.in కు వెళ్లి లాగిన్ కావాలి
ఆ తర్వాత హోమ్ పేజీలో ‘ఆన్‌లైన్ పాన్ రిజిస్ట్రేషన్’ ఎంపికపై క్లిక్ చేసి, ప్రొసీడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
యూజర్ ఇమెయిల్, పాన్ నంబర్, మొబైల్ నంబర్, పాలసీ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి
ఆ తవ్వాత గెట్ ఒటిపిపై క్లిక్ చేస్తే, కస్టమర్ మొబైల్ నంబర్‌కు ఒటిపి వస్తుంది, దానిని నమోదు చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత విజయవంతంగా పూర్తి చేసినట్టు మీకు సందేశం వస్తుంది
ఆన్‌లైన్‌లో ఎల్‌ఐసి ప్రీమియం చెల్లింపు
ప్లేస్టోర్ నుండి ఎల్‌ఐసి పే డైరెక్ట్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి
ఆ తర్వాత పే ప్రీమియంపై ట్యాప్ చేసి, పేమెంట్‌కు వెళ్లాలి
దీని తర్వాత పాలసీ నంబర్, ప్రీమియం మొత్తం, పుట్టిన తేదీ ఇవ్వాల్సి ఉంటుంది
ఆ తర్వాత పూర్తి వివరాలను క్రాస్ చెక్ చేసి, పేమెంట్ బటన్‌పై ప్రెస్ చేయాలి
ఆ తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు ప్రక్రియ చేయాలి
ఆ తర్వాత చెల్లింపు రసీదు మీ ఇ-మెయిల్‌కు అందుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News