రోజులు మారేకొద్దీ మనం తినే ఆహారాలు మారుతున్నాయి. రుచి కోసం రోడ్ పక్కల దొరికే అడ్డమైన ఆహారాలను తింటున్నాము. దీంతో అనారోగ్యం బారిన పడుతున్నాం. అంతేకాకుండా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. దీనివల్ల లుక్స్ కూడా మారిపోతాయి. బెల్లీ ఫ్యాట్ లేకపోతే మరింత అందంగా కనిపిస్తాము. అయితే, కొన్ని నియమాలు పాటిస్తే బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే.
పుష్కలంగా నీరు తాగండి
పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలంటే రోజంతా కనీసం 8-10 గ్లాసుల వరకు మంచి నీరు త్రాగాలి. ఇలా చేయడం వల్ల ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా కొవ్వును తగ్గిస్తుంది. దాదాపు ఉదయం పుట గోరువెచ్చని నీరు త్రాగడానికి ప్రయత్నించండి. గోరువెచ్చని నీరు మీ గొంతును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మీ పొట్ట కొవ్వును కూడా తగ్గిస్తుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించుకోవడానికి మరో మార్గం క్రమం తప్పకుండ వ్యాయామం చేయడం. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. వ్యాయామం లో భాగంగా మీరు వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ లేదా యోగా చేయడం వంటి చేయవచ్చు. అయితే వ్యాయామం ఎక్కువ చెమట పట్టేలా క్రమం తప్పకుండా చేస్తే అది మరింత మంచిది. ఇక రన్నింగ్, పుష్ అప్స్ చేయడం వంటివి చేస్తేయ్ అవి కొవ్వును తగ్గిస్తాయి.
మంచి ఆహారం తినండి
ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లను కలిగిన ఆహారాలను తీసుకోండి. ఇవి మీకు అవసరమైన పోషకాలను అందిచడం కాకుండా బరువు తగ్గడంతో ఎంతో సహాయం చేస్తాయి.అంతేకాకుండా కొవ్వును తగ్గిస్తుంది.
భోజనం మధ్య విరామం
భోజనాల మధ్య కనీసం 3-4 గంటల విరామం తీసుకొని ఆహారం తినండి. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొవ్వును తగ్గిస్తుంది. భోజనాల మధ్య గ్యాప్ ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే తీసుకున్న ఆహారం జీర్ణం ఐతుంది. ఇటివంటి పరిస్థితిలో మీరు భోజనానికి మధ్య గ్యాప్ తీసుకోకపోతే, అది పొట్ట కొవ్వును పెంచుతుంది.
ఒత్తిడిని తగ్గించుకోండి
అధిక ఒత్తిడి కూడా బెల్లి ఫ్యాట్ ను పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం లేదా ఇతరులతో సమయం గడపడానికి ప్రయత్నించండి. దీనితో పాటు దాదాపు రోజూ 7-8 గంటలు నిద్రపోవాలి. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొవ్వును కూడా తగ్గిస్తుంది. అయితే, మద్యం, ధూమపానం కూడా బెల్లి ఫ్యాట్ను పెంచుతుంది. అందువల్ల వాటిని వీలైనంత త్వరగా నివారించడానికి ప్రయత్నించండి.
నోట్ : పైన సేకరించిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పబ్లిష్ చేస్తున్నాము. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.