Sunday, January 5, 2025

జుట్టు తెల్లబడకుండా ఆపడం ఎలా?

- Advertisement -
- Advertisement -

ఈరోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి జుట్టు ఊడిపోతుంది. దీంతో అనేక సమస్యలు ఎదుకొంటున్నారు. అయితే, కొందరికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోంది. దీనికి జన్యుపరమైన కారణాలు, ఒత్తిడి, పోషకాహార లోపం, అనారోగ్యకరమైన జీవనశైలి ఉండొచ్చు. అయితే కొన్ని నేచురల్ రెమెడీస్, సరైన అలవాట్లను అవలంబిస్తే తెల్ల జుట్టు రాకుండా చేసుకోవచ్చు. అవేంటో మనం ఈ వార్త ద్వారా పూర్తిగా తెలుసుకుందాం.

1. ఇండియన్ గూస్బెర్రీ అని కూడా పిలువబడే ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు తెల్లబడకుండా చేస్తాయి. తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ఉసిరికాయ రసాన్ని తాగొచ్చు. అంతేకాకుండా కొబ్బరి నూనెలో వేసి మరిగించి జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. లేదా ఉసిరి పొడితో హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకోవచ్చు.

2. కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్, ఇతర పోషకాలు జుట్టును తెల్లబడకుండా చేస్తాయి. మరుగుతున్న కొబ్బరి నూనెలో కరివేపాకు ఆకులను వేసి, చల్లార్చి, ఈ నూనెతో జుట్టు మూలాలను మసాజ్ చేయడం ద్వారా కూడా తెల్లజుట్టు రాదు.

3. గుడ్లు, చేపలు, ఆకుపచ్చ కూరగాయలు, గింజలు, పండ్లు తరచుగా తీసుకోవాలి. ఇందులో ఐరన్, విటమిన్ B12, ప్రోటీన్, ఒమేగా-3 సమృద్ధిగా ఉంటాయి. దీంతో జుట్టు తెల్లబడకుండా ఉంటుంది.

4. అందరి ఇంట్లో ఎప్పుడు దొరికే ఉల్లిపాయలో సల్ఫర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. అయితే, తాజా ఉల్లిపాయ రసాన్ని జుట్టు మూలాలకు అప్లై చేసి, దాదాపు 30 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడగాలి. ఇది తెల్లజుట్టు రాకుండ చేస్తుంది.

5. జుట్టు ఊడిపోవడానికి, తెల్లజుట్టు రావడానికి అధిక ఒత్తిడి పెద్ద పాత్ర పోషిస్తుంది. దీని అదుపులో పెట్టుకోవాలంటే మీ రోజువారీ జీవితంలో యోగా, ధ్యానం, వ్యాయామం చేయాలి. ఇది ఒత్తిడిని తగ్గించి, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.అంతేకాకుండా.. కొబ్బరి నూనె, బాదం నూనె లేదా ఆముదం నూనెను తేలికగా వేడి చేసి, మీ జుట్టుకు వారానికి 2-3 సార్లు మసాజ్ చేయాలి. దీంతో తెల్లజుట్టు రాదు.

 

నోట్ : పైన సేకరించిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పబ్లిష్ చేస్తున్నాము. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News