Wednesday, January 22, 2025

కేరళపై రాహుల్ విమర్శల్లో వాస్తవమెంత?

- Advertisement -
- Advertisement -

నేడు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సామాజిక, ఆర్ధిక, మత, రాజకీయ విషయాలపై కాంగ్రెస్ ఇతర భాగ స్వామ్య పక్షాలతో కలసి ఐక్య అవగా హన, ఉమ్మడి ప్రణాళికను రూపొం దించుకోలేదు. ‘ఇండియా’ కూటమి ఉమ్మడి ఏకీకృత కార్యాచరణ పై కూడా స్పష్టత లేదు. ఎవరికి తోచినది వారు మాట్లాడుతున్నారు. ఎవరి దారి వారిదే. బిజెపి లాంటి బలమైన పార్టీతో పోరా డుతున్నామనే సోయి కాంగ్రెస్‌కు ఉన్నట్లు కనపడటం లేదు. ముఖ్యంగా సిఎఎ, ఉమ్మడి పౌరస్మృతి అంశాల మీద కాంగ్రెస్ తన అభిప్రా యాలు ఏమిటో ఎందుకు ఎన్నికల ప్రణాళికలో చేర్చేలేదని ప్రజలు ప్రశ్ని స్తున్నారు. సిఎఎ గురించి అమెరికా విమర్శించినా కాంగ్రెస్ పార్టీ ప్రణాళి కలో మాత్రం కనీస ప్రస్తావన కూడా లేకపోవటం శోచనీయం.

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ విపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులను బిజెపి ప్రభుత్వం తన దర్యాప్తు సంస్థలను దుర్వినియోగ పరుస్తూ వెంటపడి వేధించినట్లుగా, కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెంట ఎందుకు పడటం లేదంటూ ప్రశ్నంచారు. పైగా ఎల్‌డిఎఫ్‌తో బిజెపికి దోస్తీ కుదిరిందా! అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్నాయని వాపోయారు. అందుకే బిజెపిని ఎల్‌డిఎఫ్ విమర్శించటం లేదని, అందుకే బిజెపి దాడి చేయకుండా మిన్నకుందా? అంటూ ఈ అసంబద్ధమైన ప్రశ్నలు వేశారు. నిజానికీ కేరళలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి. పైగా కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రుల సంతానం సొంత పార్టీని విమర్శిస్తూ బిజెపిలోకి చేరిపోవడంతో కాంగ్రెస్ పునాదులు కృంగిపోయాయి. కాంగ్రెస్ కార్యకర్తలు వివిధ కారణాలతో బిజెపి పంచన చేరుతున్నారు. అందుకే రాహుల్ ఫస్ట్రేషన్‌లో ఉండి, వాస్తవాలు మరచి చేసిన విమర్శలో డొల్లతనం కనపడుతున్నది.

పైగా, గతంలో కాంగ్రెస్ బిజెపితో జతకట్టి సిపిఎం పై పోరాడిన చరిత్రను రాహుల్ అంతత్వరగా మరిచారా? నిజానికి సిపిఎం మొదటి నుండి బిజెపికి, కాంగ్రెస్‌కు సమదూరం పాటిస్తుంది. అవి రెండూ బూర్జువా పార్టీలే అనే అవగాహన మొదటి నుండి చేసేదే. బిజెపి మతతత్వాన్ని, నియంతృత్వ ధోరణినిని దేశ వ్యాప్తంగా వామపక్షాలు చేసినంత తీవ్ర విమర్శలు మరే పార్టీ అయిన చేసిందా? కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. గతంలో కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు గల్లీ నుండి ఢిల్లీ దాకా, పాతాళం నుండి ఆకాశం అంచుల వరకు కాంగ్రెస్ వివిధ స్థాయిల్లో చేసిన అవినీతి, అధికార దుర్వినియోగ చరిత్ర ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం గుప్పిటలో ఉంది. అందుకే బిజెపి కాంగ్రెస్ ను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నది. తన దర్యాప్తు సంస్థలను అందుకోసం కాంగ్రెస్ పైన, ఇతర విపక్షాలపైకి ఉసిగొల్పుతుంది. అయితే కాంగ్రెస్ గతంలో చేసిన అవినీతి, అధికార దుర్వినియోగం సిపిఎం చేయలేదు. కనుక బిజెపికి కక్ష తీర్చుకోవడానికి అవకాశం లేకపోయింది. అంతేకానీ బిజెపికి వామపక్షాలపై ప్రేమ ఉండి కాదు.

ఇంత వరకు బిజెపి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలను వామపక్షాలు ఎప్పుడూ, ఎక్కడా, ఎన్నడూ సమర్ధించలేదు. పైగా బిజెపి రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ప్రతి సందర్భంలోనూ ఘాటుగా విమర్శించింది కూడా. బిజెపితో పోరాడటానికి సర్వదా సిద్ధమైన వామపక్షాలతో మిత్రత్వం పెంచుకోవడానికి బదులుగా ఇలా రాజకీయంగా పతనమవుతూ రాహుల్ గాంధీ మాట్లాడటం పెద్ద తప్పు. ఆయన ఉపన్యాసం పరోక్షంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పైన తప్పుడు కేసులు పెట్టమని మోడీని వేడుకున్నట్లుగా కనపడుతున్నది తప్ప మరొకటి కాదు. కాబోయే ప్రధానిగా రాహుల్ గాంఢీని ఊహించుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, ఇతర అభిమానులు రాహుల్ గాంధీకి అంత పరిణతి ఉందా! అని ప్రశ్నించుకోవాలి. ఇంకా ఆ దశకు రాహుల్ చేరుకోలేదని ఆయన మాటలు, చేతలు దేశ ప్రజలకు తేటగా తెలుపుతున్నాయి.

తనకు మిత్రులెవరో, శత్రువులెవరో గుర్తించలేని అస్పష్టత ఆయన మాటల్లో కనపడుతున్నది. ఈ అసంబద్ధ మాటలే ‘ఇండియా’ కూటమిని ఐక్యత లేకుండా బలహీనం చేస్తుంది. నేడు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సామాజిక, ఆర్ధిక, మత, రాజకీయ విషయాలపై కాంగ్రెస్ ఇతర భాగస్వామ్య పక్షాలతో కలసి ఐక్య అవగాహన, ఉమ్మడి ప్రణాళికను రూపొందించుకోలేదు. ‘ఇండియా’ కూటమి ఉమ్మడి ఏకీకృత కార్యాచరణ పై కూడా స్పష్టత లేదు. ఎవరికి తోచినది వారు మాట్లాడుతున్నారు. ఎవరి దారి వారిదే. బిజెపి లాంటి బలమైన పార్టీతో పోరాడుతున్నామనే సోయి కాంగ్రెస్‌కు ఉన్నట్లు కనపడటం లేదు. ముఖ్యంగా సిఎఎ, ఉమ్మడి పౌరస్మృతి అంశాల మీద కాంగ్రెస్ తన అభిప్రాయాలు ఏమిటో ఎందుకు ఎన్నికల ప్రణాళికలో చేర్చేలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సిఎఎ గురించి అమెరికా విమర్శించినా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలో మాత్రం కనీస ప్రస్తావన కూడా లేకపోవటం శోచనీయం.

ఈ ప్రధాన అంశాలపై పోరాడిన చరిత్ర కూడా కాంగ్రెసు శ్రేణులకు లేదు. పైగా సిఎఎకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో కలసి కేరళ ప్రభుత్వం నిరసన తలపెడితే చివరి క్షణంలో కాంగ్రెస్ మెల్లెగా వెనక్కు జారుకుంది. ఈ విషయంలో కాంగ్రెస్ తమ ఉద్దేశాలను ప్రజలకు చెప్పితీరాలి. అలాగే జమ్మూలోని కథువాలో 8 ఏళ్ళ బాలిక మీద అత్యాచారం, హత్య చేసిన ఉదంతం దేశంలో తీవ్ర సంచలనం కలిగించిన విషయంగా అందరికీ తెలిసిందే. ఈ కథువా ఉదంతంలో నిందితులకు మద్దతుగా ప్రదర్శనలు చేసిన వారిలో ఒకడైన బిజెపి నేత చౌదరి లాల్ సింగ్‌ను స్వయంగా రాహుల్ గాంధీ గత నెలలో కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడం దేశ ప్రజలకు ఆశ్చర్యం, ఆందోళన కలిగించింది. ఇప్పుడు ఏకంగా ఆ నిందితుడు చౌదరీ లాల్ సింగ్‌ను ఉదంపూర్ లోక్‌సభ అభ్యర్ధిగా కాంగ్రెస్ నిలిపడం దేశాన్ని షాక్‌కు గురిచేసింది.

ఇదేనా దేశ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చే హామీ. రాజకీయంగా బిజెపిని వ్యతిరేకించడం అంటే? ఎన్నికల బాండ్ల కుంభకోణంలో బిజెపి ప్రధానంగా లాభపడిన మాట నిజమే. అది దేశ సంపదను లూటీ చేసిందని రాహుల్ విమర్శించాడు. బాగానే ఉంది. కానీ, కాంగ్రెస్ కూడా అదే ఎన్నికల బాండ్ల ద్వారా రూ. 1,952 కోట్లు లబ్ధి పొందిన రెండవ అతి పెద్ద పార్టీ. అది మాత్రం లూటీదారుడు ముద్ర పడకుండా తప్పించుకుంటుందా? కాంగ్రెస్ ఇప్పటికైనా తన ఎన్నికల ప్రచారంలో ఊహలు, భ్రమలు వీడాలి. తన పార్టీ ప్రణాళికలో ఆచరణ సాధ్యమైన విషయాలను మాత్రమే ప్రధానంగా ప్రస్తావించాలి.

ఆచరణ సాధ్యం కాని వాటిని బహిరంగంగా ప్రకటించి వాటిని వదులుకోవాలి. ఇప్పటికే కర్నాటకా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వలు అలవిగాని ఎన్నికల వాగ్దానాలు చేశాయి. వాటిని ఆచరణలో నెరవేర్చలేక నానాఅగచాట్లు పడుతున్నాయి. బిజెపి ఎన్నికల గ్యారెంటీలోని లోపాలను కూడా కాంగ్రెస్ సహేతుకంగా విమర్శించాలి.అంతేగానీ బలమైన బిజెపిని ఎదుర్కొనే భావసారూప్యం గల మిత్రపక్షాలలో చీలికలు తీసుకు రావడానికి రాహుల్ మాటలు, చేతలూ దోహదం చేయకుండా చూసుకోవాలి. చేసిన తప్పులు సరిదిద్దుకోలేకపోతే ముప్పును ఎదుర్కోక తప్పదు.

డా. కోలాహలం రామ్ కిశోర్
9849328496

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News