Monday, December 23, 2024

ఎంపిక ఎలా చేశారు?

- Advertisement -
- Advertisement -

అభ్యర్థుల సెలక్షన్‌పై పిఇసి సభ్యులను ప్రశ్నించిన స్క్రీనింగ్ కమిటీ

23మంది సభ్యులను విడివిడిగా అడిగి తెలుసుకున్న కమిటీ

మొదటినుంచి పార్టీలో ఉన్నవారికే టికెట్లు ఇవ్వాలని స్క్రీనింగ్ కమిటీకి జగ్గారెడ్డి వినతిపత్రం

మాకూ టికెట్లు ఇవ్వండి: ఒయు జెఎసి వినతి

మనతెలంగాణ/ హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును తీవ్రతరం చేసింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన స్క్రీనింగ్ కమిటీ సోమవారం ఉదయం 11 గంటల నుంచి గాంధీ భవన్‌లో రాష్ట్ర ఎన్నికల కమిటీ (పీఈసీ) సభ్యులతో విడివిడిగా మాట్లాడింది. మధ్యాహ్నం 1 గంట వరకు 10మంది సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ చర్చించింది. అనంతరం మరో 13 మంది సభ్యులతో భోజన విరామం తరువాత సాయంత్రం వరకు స్క్రీనింగ్ కమిటీ సమావేశమయ్యింది. మొత్తం మీద సాయంత్రం వరకు మొత్తం 23 మంది ఎన్నికల కమిటీ సభ్యుల అభిప్రాయాలను స్క్రీనింగ్ కమిటీ తీసుకుంది. అభ్యర్థులను ఎలా ఎంపిక చేశారు? వారికి టిక్‌లు ఎందుకు పె ట్టారు? టిక్ పెట్టడానికి కారణాలను స్క్రీనింగ్  కమిటీ పీఈసీ సభ్యులను అడిగి తెలుసుకుంది. అయితే జగ్గారెడ్డి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, కమిటీ సభ్యుడు బాబా సిద్ధిఖీలకు వినతిపత్రాన్ని అందించారు.

కొత్త వాళ్లకు కాకుండా మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్లకే టికెట్‌లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆయన ఈ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇక పొన్నాల లక్ష్మయ్య కూడా చైర్మన్‌కు పార్టీలోని పలు అంశాలను, టికెట్ కేటాయింపులకు సంబంధించిన పలు అంశాల గురించి వారితో చర్చించారు. ఇక స్క్రీనింగ్ కమిటీని ఓ యూ జేఏసి నాయకులు కలిసి తమకు కూడా టికెట్‌లు కేటాయించాలని గతంలో తాము ప్రత్యేక తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమించామని వారు ఆ కమిటీకి వినతిపత్రం అందించారు. నేడు పార్టీ జిల్లా అ ధ్యక్షుడు, మాజీ మంత్రులు, మాజీ ఎంపిలతో స్క్రీనింగ్ కమిటీ చర్చించనుంది. బుధవారం స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుం ది. హైదరాబాద్‌లో స్క్రీనింగ్ కమిటీ సమావేశం మొదలు కావడంతో ఆశావహులంతా గాంధీ భవన్‌కు చేరుకొని ఎవరి ప్రయత్నాలు వారు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News