Thursday, January 23, 2025

బిజెపికి 400కు పైగా సీట్లు ఎట్లా వస్తాయి? : ఖర్గే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రతి చోట ఓడుతున్న బిజెపి పార్టీకి 400కు పైగా సీట్లు ఎలా వస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ఇండియా బ్లాక్ కు మెజారిటీ రాబోతోందని ఆయన అన్నారు. తన హోంటౌన్ కలబురగిలో ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఇండియా కూటమికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని అన్నారు.

ఇది ప్రధాని నరేంద్ర మోడీ, ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని ఆయన అన్నారు. ఎందుకంటే దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందన్నారు. పైగా భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై పెద్ద దాడి జరుగనున్నదని ఆయన హెచ్చరించారు. బిజెపి రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేసి పాలిస్తోందన్నారు. అందుకనే ప్రజలు ఇండియా కూటమిని గెలిపించి బిజెపికి షాక్ ఇవ్వబోతున్నారని అన్నారు. అందుకనే ఇండియా కూటమి సానుకూలతలు ఎక్కువ ఉన్నాయన్నారు. బిజెపి తిరిగి అధికారంలోకి రాకుండా ఆపగలిగే సామర్థ్యం ఇండియా కూటమికే ఉందన్నారు. జూన్ 4 వరకు ప్రజలు ఆగాలని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాల ఆధారంగానే తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు. తన లెక్క(అంచనా) ప్రకారం బిజెపి ప్రతి రాష్ట్రంలో ఓడుతోందన్నారు. ఈసారి కాంగ్రెస్ సీట్లు పెరుగుతాయని కూడా ఆయన తెలిపారు.  ఇండియా బ్లాక్ కు ఎక్కువ సీట్లు రాబోతున్నాయన్న సూచనలు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News