Tuesday, April 1, 2025

మార్కెట్లోకి హెచ్‌పి ఎఐ ల్యాప్‌టాప్‌లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గేమర్‌లు, కంటెంట్ సృష్టికర్తల కోసం రూపొందించిన ఎఐ మెరుగైన ల్యాప్‌టాప్‌లను హెచ్‌పి విడుదల చేసింది. కొత్తగా ప్రారంభించబడిన ల్యాప్‌టాప్‌లలో ఓమెన్ ట్రాన్సెండ్ 14, హెచ్‌పి ఎన్వీ ఎక్స్360 14 ఉన్నాయి. కొత్త సిరీస్ ల్యాప్‌టాప్‌లు అల్ట్రా ప్రాసెసర్లు హై-ఎండ్ గేమింగ్, వినియోగదారుల క్రియేషన్ అనుభవాన్ని అందించడంలో సహాయపడతాయని కంపెనీ తెలిపింది. రూ. 1,74,999 ప్రారంభ ధర కల్గిన హెచ్‌పి ఓమెన్ ట్రాన్సెండ్ 14 రెండు రంగులలో అందుబాటులో ఉంది.

అయితే హెచ్‌పి ఎన్వీ ఎక్స్360 14 ప్రారంభ ధర రూ. 99,999 ఇది రెండు రంగులలో అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా హెచ్‌పి ఇండియా హెడ్- కన్స్యూమర్ అండ్ గేమింగ్ పిసి టి.గణేష్ మాట్లాడుతూ, ఓమెన్ ట్రాన్సెండ్ 14, హెచ్‌పి ఎన్వీ ఎక్స్360 14తో సహా కొత్త లైనప్ ఉత్పాదకతను మెరుగుపరచడానికి ఎఐతో అమర్చామని అన్నారు. ఒమెన్ ట్రాన్సెండ్ 14 దాని ఎఐ -మెరుగైన లక్షణాలతో ఉన్నతమైన గ్రాఫిక్స్, వ్యక్తిగతీకరించిన గేమ్‌ప్లేతో ఎలివేటెడ్ గేమింగ్ అనుభవాలను అందిస్తుంది. అదనంగా హెచ్‌పి ఎన్వీ ఎక్స్360 14 ఎఐ -మెరుగైన ఆడియో, వీడియో సామర్థ్యాలు కంటెంట్ సృష్టిలో మార్పులకు సెట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News