Monday, December 23, 2024

హృతిక్ చేదు అనుభవం.. ఆ సమయంలో చనిపోతాననుకున్నా

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. తాను గతంలో నటించిన వార్ సినిమాకు శారీరకంగా చాలా కష్టపడటంతో డిప్రెషన్ కు గురయ్యాయని తెలిపాడు. ఒకానొక సమయంలో చనిపోతాననుకున్నానని చెప్పాడు. జీవితంలో మార్పు అవసరమని అప్పుడే అనుకున్నట్లు వివరించాడు. ఫిట్ నెస్ ట్రైనర్ క్రిస్ గెతిన్ చేసిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని హృతిక్ వెల్లడించాడు. తర్వాత హృతిక్ కు ఇచ్చిన శిక్షణను గెతిన్ గుర్తు చేసుకున్నాడు. 2013లో తన దగ్గర శిక్షణ తీసుకున్న ఏడు నెలల్లో ఏ ఒక్కరోజూ కూడా హృతిక్ విరామం తీసుకోలేదని చెప్పుకొచ్చాడు. దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తీసిన వార్ చిత్రంలో హృతిక్ రోషన్ తో పాటు టైగర్ ష్రాఫ్ కీ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2019లో అక్టోబర్ 2తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News