Sunday, November 17, 2024

ఆర్యన్ ఖాన్‌కు బహిరంగ లేఖ రాసిన హృతిక్ రోషన్

- Advertisement -
- Advertisement -

Hrithik wrote to Aryan

ముంబయి: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మాదక ద్రవ్యాల సేవనం కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్‌కు బహిరంగ లేఖ రాశారు. ముంబయి నుంచి గోవాకు ఆదివారం బయలుదేరిన క్రూయీజ్ నౌకలో రేవ్ పార్టీ జరుగుతుండగా మాదకద్రవ్యాల నిరోధక శాఖ(ఎన్‌సిబి) షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఆర్యన్‌కు రాసిన లేఖలో హృతిక్ రోషన్ నేను అతడికి సానుభూతి తెలుపుతున్నాను. అనుభవిస్తున్న ఈ చీకటి అతడికి వెలుగును చూయిస్తుందని ఆశిస్తున్నాను. “మై డియర్ ఆర్యన్, జీవితం చాలా వింతైనది. అనిశ్చితి కారణంగా అది గొప్పది కూడా. దేవుడు దయామయుడు. బలంగా నిలబడే వారిపైనే గట్టి బాల్స్ వేస్తాడు. గందరగోళం మధ్య నీవే ఎంపికవడం వల్ల ఆ ఒత్తిడిని నీవు చవిచూడాల్సిందే.కోపం, అయోమయం, నిస్సహాయత వంటివి నీలోని హీరోను లేపుతాయి. అవే దయ, సానుభూతి,ప్రేమ వంటి మంచి గుణాలను కూడా నాశనం చేస్తాయని గ్రహించు” అని హృతిక్ రాశాడు.

“ లవ్ యూ మ్యాన్‌” అంటూ లేఖను ముగించాడు. హృతిక్ రోషన్‌కు విడిపోయిన భార్య సుస్సాన్ ఖాన్‌తో హృధాన, హ్రేహాన్ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. గడ్డు కాలంలో షారూఖ్ ఖాన్ కుటుంబానికి హృతిక్ రోషన్ ఒక్కడే కాక సల్మాన్ ఖాన్, అతడి సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రి వంటి వారు కూడా మద్దతుగా నిలబడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News