Monday, December 23, 2024

క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్, లక్షసేన్

- Advertisement -
- Advertisement -

టోక్యో: జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు హెచ్‌ఎస్ ప్రణయ్, లక్షసేన్‌లు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్‌సాయిరాజ్‌ చిరాగ్ శెట్టి జోడీ ప్రీక్వార్టర్ ఫైనల్లో విజయం సాధించింది. కాగా, గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్లో భారత అగ్రశ్రేణి షట్లర్ ప్రణయ్ జయకేతనం ఎగుర వేశాడు. భారత్‌కే చెందిన కిదాంబి శ్రీకాంత్‌తో జరిగిన పోరులో ప్రణయ్ 1921, 219, 219 తేడాతో జయకేతనం ఎగుర వేశారు. తొలి సెట్‌లో శ్రీకాంత్ పైచేయి సాధించాడు. హోరాహోరీగా సాగిన సెట్‌లో ప్రణయ్ ఓటమి పాలయ్యాడు. అయితే తర్వాత జరిగిన రెండు సెట్లలో ప్రణయ్ ఆధిపత్యం చెలాయించాడు.

శ్రీకాంత్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరో మ్యాచ్‌లో లక్షసేన్ విజయం సాధించాడు. జపాన్ ఆటగాడు సునుయామాతో జరిగిన పోరులో లక్షసేన్ 2114, 2116 తేడాతో జయభేరి మోగించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత స్టార్ షట్లర్ సేన్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. చివరి వరకు జోరును కొనసాగిస్తూ అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. ఇక డబుల్స్‌లో సాత్విక్ జోడీ 2117, 2111 తేడాతో డెన్మార్క్‌కు చెందిన లాసెబే జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News