Tuesday, January 21, 2025

ఇందిరమ్మ ఇళ్లకు హడ్కో నిధులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధుల కొరత తీరనున్నది. రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తుపై తొలి దశలో రూ. 3000 కోట్లను రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థకు రుణం ఇచ్చేందుకు హడ్కో అంగీకరించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 ఇళ్ల చొప్పున ఏటా 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత నెలలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ప్రారంభించింది.  లోక్ సభ ఎన్నికలు ముగిసిన తరువాత అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చట్టింది. నిధుల కొరత రాకుండా హడ్కో నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ ప్రాంతంలో నిర్మించే ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం రూ. 1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. కేంద్ర నుంచి ఈ మొత్తాన్ని కూడా సేకరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది.

ఇళ్ల నిర్మాణానికి దశల వారీగా రుణం ఇవ్వాలని కూడా హడ్కో నిర్ణయించింది. తొలి దశలో రూ. 850 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయని సమాచారం. ఇందిరమ్మ ఇళ్లను ఇళ్లు లేని వారికి ఇస్తారా, లేక ఇళ్లు లేని మహిళల పేరిటే ఇస్తారా? అన్నది శేష ప్రశ్న. ఎందుకంటే ఒంటరి పురుషులు, వృద్ధులను లెక్కలోకి తీసుకోరా అన్నది కొందరి ప్రశ్న.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News