Sunday, December 22, 2024

హైదరాబాద్ సమీపంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ సమీపంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రూ. 9 కోట్ల విలువైన డ్రగ్స్ ను అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. ఐడీఏ బొల్లారంలోని ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇంటర్ పోల్ సమాచారంతో పిఎస్ఎన్ మెడికేర్ కంపెనీలో సోదాలు నిర్వహించిన డ్రగ్ కంట్రోల్ అధికారులు 90 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పదేళ్లుగా డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు తరలిస్తున్న కస్తూరిరెడ్డిని అరెస్ట్ చేశారు. సిగరేట్ ప్యాకెట్లలో డ్రగ్స్ పెట్టి విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్లో కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పిఎస్ఎన్ కంపెనీ పలు దేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News