Sunday, December 22, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం స్వాధీనం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జెడ్డా, దుబాయ్‌ల నుండి వేరు వేరు పార్సెల్‌లలో శంషాబాద్ విమానాశ్రయంలో వచ్చిన పార్సె ల్‌లను తనిఖీలు నిర్వహిస్తుండగా మూడు పార్సెల్‌లో బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ప్రయాణికులు బంగారు కడియాలను, బంగారం బిస్కెట్‌లను కవర్లలో చుట్టి అక్రమంగా దాచిపెట్టి తరలి స్తుండగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మూడు పార్సెల్‌లో 61.21 లక్షల విలువ చేసే 970 గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News