Thursday, January 23, 2025

సెట్స్ దరఖాస్తులు 4,43,557

- Advertisement -
- Advertisement -

Huge applications for entrance exams

ఈసారి భారీగా పెరిగిన దరఖాస్తుదారుల సంఖ్య
2.66 లక్షలు దాటిన ఎంసెట్ అప్లికేషన్స్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఎంసెట్, ఇసెట్, ఐసెట్, పిజిఇసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పిఇసెట్‌లకు బుధవారం వరకు 4,43,557 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో సగానికి పైగా దరఖాస్తులు ఎంసెట్ కోసం వచ్చాయి. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా పరీక్షలు లేకుండా విద్యార్థులందరినీ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో పాస్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఈసారి ఎంసెట్ దరఖాస్తులు భారీగా పెరిగాయి. ఎంసెట్‌కు 2,66,182 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఇసెట్‌కు 24,040 దరఖాస్తులు వచ్చాయి. అలాగే ఐసెట్‌కు 68,902 మంది దరఖాస్తు చేసుకోగా, పిజిఇసెట్‌కు 12,594 మంది, లాసెట్‌కు 33,975 మంది, ఎడ్‌సెట్‌కు 35,219 మంది, పిఇసెట్‌కు 2,275 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

ఈ నెలంతా పరీక్షలు

రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రవేశ పరీక్షలు ఈ నెలలోనే జరుగనున్నాయి. ఈ నెల 14,15,18,19,20 తేదీలలో ఎంసెట్ పరీక్ష జరుగనుండగా, 13న ఇసెట్, 27,28 తేదీలలో ఐసెట్ పరీక్షలు జరుగనున్నాయి. అలాగే ఈ నెల 29, ఆగస్టు 30న పిజిఇసెట్, 21న మూడేళ్ల లాసెట్, 22న ఐదేళ్ల లాసెట్, పిజిఎల్‌సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 26న ఎడ్‌సెట్, ఆగస్టు 22న పిఇసెట్ పరీక్షలు జరుగనున్నాయి.

వివిధ సెట్లకు వచ్చిన దరఖాస్తుల వివరాలు

సెట్ పేరు                                              వచ్చిన దరఖాస్తులు

ఎంసెట్                                                 2,66,182

ఇసెట్                                                 24,040

ఐసెట్                                                 60,902

పిజిఇసెట్                                            12,594

లాసెట్                                                33,975

ఎడ్‌సెట్                                              35,219

పిఇసెట్                                              2,275

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News