Monday, December 23, 2024

ప్రధాని సభకు భారీ బందోబస్తు.. వెయ్యి మందితో భద్రత

- Advertisement -
- Advertisement -

వెయ్యి మందితో భద్రత
పర్యటను అడ్డుకుంటే కఠిన చర్యలు
సమీక్షించిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్

హైదరాబాద్‌లో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్రానికి చెందిన 1,000 మంది పోలీసులను ప్రధాని పర్యటన భద్రతకు నియమించారు. ఇప్పటికే ట్రయిల్ రన్‌ను పోలీసులు పూర్తి ఏశారు. బేగంపేట నుంచి సికింబ్రాద్ రైల్వే స్టేషన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ప్రధాని నరేంద్రమోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, పరేడ్ గ్రౌండ్‌లో సభలో పాల్గొననున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాటితోపాటు భద్రతకు పోలీసులకు విధులు కేటాయించారు. ప్రధాని పర్యటనను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాని పర్యటన భద్రత విధులు నిర్వర్తించేవారు ఉదయమే రిపోర్టింగ్ చేయాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News