మేయర్‌తో కలిసి మంత్రి తలసాని ఏర్పాట్ల పరిశీలన
బిజెపి స్వార్థ రాజకీయాలకు
దేవుళ్లను అడ్డం పెటుకోవడం దుర్మార్గం: మంత్రి తలసాని
హైదరాబాద్: వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై బిజెపి రాజకీయం చేస్తు నిర్వహకులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ధ్వజమెత్తారు. బిజెపి నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం చివరికి దేవుళ్లను సైతం అడ్డుం పెట్టుకుకోవడం వారి దుర్మార్గపు చర్యలకు పరాకాష్ట అన్నారు. ఈనెల 9న జరగనున్న వినాయక నిమజ్జనానికి హుస్సేన్‌సాగర్‌తో పాటు గ్రేటర్ వ్యాప్తంగా భారీ ఏర్పాట్లను చేపట్టామని వారు వెల్లడించారు. హుస్సెన్‌సాగర్ ఎన్టిఆర్ మార్గ్‌తో పాటు ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనానికి చేస్తున్న ఏర్పాట్లను బుధవారం ఓపెన్ టాప్ వాహనంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల విజయల మీడియాతో కలిసి పరిశీలించడంతో పాటు ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఒకొక్కటిగా వివరిస్తూ ముందుకు సాగారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రతి పండగను ప్రజలు ఆనందోత్సహాల మధ్య జరుపుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోందని మంత్రి తలసాని అన్నారు. పండగ ఏర్పాట్ల పై ఎవరితో ఎదో చెబితే చేసే ప్రభుత్వం కాదని, ప్రజల సంతోషమే లక్షంగా పని చేస్తున్నమన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వహకులు ఎవరో చెప్పిన మాటలు నమ్మి గందరగోళానికి గురికావద్దని నిమజ్జనానికి అవసరమైన ప్రతిదీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. నిర్వహకులకు వివరించేందుకే మేయర్ తో కలిసి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లను పరిశీలించామని వెల్లడించారు. నిమజ్జనం 9వ తేదీ ఉన్నందునా ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌తో పాటు పర్యాటకులకు ఇబ్బందులు కల్గకుడదనే క్రమ క్రమంగా ఏర్పాట్లు చేస్తున్నామని, గురువారం రాత్రి వరకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతాయని తెలిపారు. అంతలోనే కొందరూ తమ ఉనికిని చాటుకునేందుకే రా ్యలీలు, దీక్షలు చేస్తున్నారని, ఇలాంటి చర్యలు బాధకరమన్నారు. అన్ని పండుగలను గొప్పగా జరపాలనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ వస్తుందని వివరించారు. నగరంలో నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు దేశంలోనే ఎంతో ప్రత్యేకత ఉందని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నమన్నారు.
నవరాత్రుల సందర్భంగా జిహెచ్ఎంసి పరిధిలో సుమారు 38 వేల విగ్రహాలను ప్రతిష్టించారని వీటన్నింటిని ప్రశాంతగా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు. 2014 కు ముందు ఇన్ని ఏర్పాట్లు లేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాతనే పెద్ద ఎత్తున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. నిర్వహకులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా జిహెచ్ఎంసి, పోలీస్, ట్రాఫిక్, వాటర్ వర్క్, ఎండోమెంట్, ఎలక్ట్రికల్, టూరిజం, హెల్త్, ఆర్ అండ్బి, రెవెన్యూ తదితర శాఖల ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తోందని వివరించారు. 9 వ తేదీన నిమజ్జనం సందర్భంగా శోభయాత్రగా తరలి వచ్చే వినాయకలకు దారి పొడవునా ఘనంగాస్వాగతం పలికనున్నమన్నారు. ఇందుకు బాలాపూర్ వినాయకుడి నుండి లాల్ దర్వాజ, చార్మినార్, అప్జల్ గంజ్, బేగం బజార్, ఎంజె మార్కెట్ తదితర ప్రాంతాలలో స్వాగత వేదికలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కొందరూ హిందువుల పండుగలు అంటూ వేరుచేసి మాట్లాడుతున్నారని, మేము హిందువులము కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు, ప్రవర్తనలను మానుకోవాలని మంత్రి హితవు పలికారు.