Friday, January 24, 2025

జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు.. పలు ఇళ్లు ధ్వంసం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు సంభవించింది. చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు నంబర్‌ 1లోని తెలంగాణ స్పైసీ కిచెన్‌ రెస్టరంట్‌లో తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఈ పెలుడు జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి ప్రహరీ గోడ ధ్వంసమైంది. రాళ్లు ఎగిరిపడి పక్కనే ఉన్న బస్తీలోని ఇండ్లపై పడ్డాయి. పలు రేకుల ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో బండరాళ్లు పడి ఓ మహిళ తలకు గాయం కాగా, మరో బాలికకు స్వల్ప గాయాలయ్యాయి.

ఒక్కసారిగా భారీ శబ్దంతో బండరాళ్లు పడుతుండటంతో బస్తీవాసులు భయాందోళనకు గురై దూరంగా పరుగులు పెట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. హోటల్లోని రిఫ్రిజిరేటర్‌లో ఉన్న కంప్రెసర్ పేలినట్లు గుర్తించారు. మా ఇండ్లు ధ్వంసం కావడంతో తమకు నష్ట పరిహారం ఇవ్వాలని బస్తీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News