Sunday, April 27, 2025

ఇరాన్‌లో భారీ పేలుడు.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

టెహ్రాన్: ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ నగరంలోని షహీద్ రజేయి పోర్టులో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఓ భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. 500 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోర్టులోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించింనట్లు భావిస్తున్నారు. పేలుడు కారణంగా దట్టమైన పొగలు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. పేలుడు ధాటికి కొన్ని కిలోమీటర్ల మేర ఉన్న భవనాల కిటీలు ధ్వంసమైనట్లు చెబుతున్నారు. మంటలను అదుపు చేసేందుకు పోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News