Sunday, December 22, 2024

భారీగా నగదు పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ శివారులో సోదాలు..
ఆరు కార్లలో రూ. 6.50 కోట్లు స్వాధీనం

మన తెలంగాణ/హైదరాబాద్/మొయినాబాద్ : తెలంగాణ ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతోంది. శనివారం భారీ మొత్తంలో రూ.6.5 కో ట్లు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తం పట్టుబడటం ఇదే తొలిసారి. అయితే ఆ పట్టుబడ్డ నగదు ఖమ్మం జిల్లా నుంచి పోటీచేస్తున్న వ్యక్తిదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలోనే ఆ డబ్బు తరలిస్తున్నట్లుగా సమాచారం. సామాన్యుల వద్దనే తనిఖీలలో డబ్బులు పట్టుబడగా ప్రప్రథమంగా రాజకీయ నేతలకు సంబంధించిన సొమ్ములు లభ్యం కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ ఒఆర్‌ఆర్ అప్పా కూడలి వద్ద నిర్వహించిన సోదాల్లో 6 కార్లలో రూ.6.50 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూ పించకపోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు.

ముందస్తు సమాచారంతోనే ఫ్లయింగ్ స్క్వాడ్ ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సీజ్ చేసిన నగదును ఇన్‌కంటాక్స్ అధికారులకు అప్పగించున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్న అధికార, ప్రతిపక్ష నేతల వాహనాలను సైతం చెక్ చేస్తున్నారు. కేంద్ర బలగాల సమన్వయంతో ఎన్నికల వేళ తనిఖీలను పోలీసులు, అధికారులు ముమ్మరం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 148 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి మరీ ఈ తనిఖీలు చేపడుతున్నారు. పోలీసులు, అధికారులతో పాటు సంబంధిత శాఖాధికారులు సైతం ఈ కార్యక్రమంలో నిమగ్నమవుతున్నారు. వరకు రూ.500 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారం సీజ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం పట్టుబడ్డ రూ.6.5 కోట్లు నగదుపై సమగ్ర విచారణ జరుగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

the vehicle

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News