Monday, December 23, 2024

జూబ్లీహిల్స్ పరిధిలో భారీగా నగదు పట్టివేత

- Advertisement -
- Advertisement -

Huge cash seized in Jubilee Hills

జూబ్లీహిల్స్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం భారీగా నగదు పట్టుబడింది. రోడ్ నెంబర్ 71లో థార్ కారులో తరలిస్తుండగా 90 లక్షల రూపాయాలను పోలీసులు గుర్తించారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అసలు డబ్బు ఎవరిది.. ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అటు మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నగదు పట్టుబడుతున్న ముచ్చట తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News