Monday, December 23, 2024

పంజాబ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
Fire Smoke in Hospital
భారీగా అలుముకున్న పొగలు 
గురునానక్ దేవ్ హాస్పిటల్ ఎక్స్-రే డిపార్ట్‌మెంట్ సమీపంలోని భవనం వెనుక పార్కింగ్ ప్రాంతంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుండి మంటలు చెలరేగాయని సిబ్బంది తెలిపారు. 
అమృత్‌సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈరోజు సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అయితే, పేషెంట్లను సకాలంలో భవనం నుంచి బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. దట్టమైన పొగ మేఘాల వెనుక ఆసుపత్రి భవనం పూర్తిగా కప్పబడి ఉన్నట్లు స్పాట్  దృశ్యాలు చూపించాయి. గురునానక్ దేవ్ హాస్పిటల్ ఎక్స్-రే విభాగానికి సమీపంలోని భవనం వెనుక పార్కింగ్ ప్రాంతంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుండి మంటలు చెలరేగాయని చెప్పారు. భవనంలోని వివిధ వార్డుల్లో చేరిన రోగులను ఆసుపత్రి ఉద్యోగులు, వారి అటెండర్లు సకాలంలో తరలించినట్లు వారు తెలిపారు. “ప్రారంభంలో, ట్రాన్స్‌ఫార్మర్‌లలో మంటలు చెలరేగాయి. ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు అదుపులోకి వచ్చాయి. ఎవరు గాయాలపాలు కాలేదని అగ్నిమాపక అధికారి లవ్‌ప్రీత్ సింగ్ తెలిపినట్లు  ఎఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.  ప్రస్తుతం మంటలను  ఆర్పివేశారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News