Monday, December 23, 2024

కాంగ్రెస్ మూడో విడత జాబితాలో భారీ పోటీ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : పెండింగ్‌లో ఉన్న 58 నియోజక వర్గాల అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ నాయకులు సోమవారం ఢిల్లీలో చర్చలు జరిపారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ముకుల్ వాస్నిక్, వీరప్ప మొయిలీ, కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జెవాలా, కేపీసీసీ అధ్యక్షుడు డికె శివకుమార్ , ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

రెండో విడతలో ప్రకటించిన 42 మంది అభ్యర్థుల జాబితాలో భారీ అసంతృప్తులు వినిపించాయి. టికెట్ రానివారు జెడిఎస్, బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఇలా పార్టీని వీడిన వారిలో బలమైన నాయకులు ఉండటం కాంగ్రెస్‌కు మింగుడు పడడం లేదు. మూడో విడత జాబితాలో భారీ పోటీ నెలకొంది. దీనివల్ల నేతల భేటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అన్నీ చర్చించిన తరువాతనే అభ్యర్థులను ఎంపిక చేయాలని నిశ్చయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News