Monday, December 23, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ వెనక భారీ కుట్ర: మంత్రి పువ్వాడ

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: విశాఖ స్టీల్ ప్లాంట్ వెనక కుట్ర జరుగుతోందని తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం బైలదిల్లా గనులను అదానీపరం చేస్తోందని మంత్రి పువ్వాడ మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు క్యాపిటివ్ గనులు లేకుండా చేసి మూసివేస్తారని పువ్వాడ చేప్పారు. బైలదిల్లా నుంచి ఐరన్ ఓర్ ను ముంద్రాకు తరలించేందుకు కుట్ర జరుగుతోందని మంత్రి ఆరోపించారు.

బయ్యారానికి కేటాయించకుండా గుజరాత్ కు తరలిస్తున్నారని పువ్వాడ పేర్కొన్నారు. అదానీ కోసమే 1800 కి.మీ దూరంలోను ముంద్రాకు తరలించారన్నారు. బయ్యారం ఎప్పటికీ పరిశ్రమ ఏర్పాటు జరగకుండా కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మౌలిక వసతుల్లో 50శాతం ఖర్చు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పువ్వాడ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News