Monday, December 23, 2024

సూర్యుడిపై ఏర్పడ్డ భారీ బిలం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : సూర్యుడులో అంతర్గత మార్పుల పరిణామాల నేపథ్యంలోనే సూర్యుడి ఉపరితలంలో భారీ బిలాన్ని కనుగొన్నారు. ఈ బిలం ఏకంగా భూమి కన్నా 20 ఇంతలకు పైగా ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) శాస్త్రజ్ఞుల అన్వేషణాక్రమలో కనుగొన్నారు. ఈ మధ్యకాలంలో అమెరికాలో ఆకాశంలో పలు రకాల వింత దట్టమైన కాంతులకు కారణం సూర్యుడి బాహ్యావలయం కరోనా విస్పోటనంతో అయస్కాంత క్షేత్రాలకు ముప్పు వాటిల్లిందనే విషయం నిర్థారణ అయింది. ఇప్పుడు భూ గోళ పరిణామాన్ని పలు స్థాయిల్లో పెద్దగా ఉండే ఈ బిలం ఉన్నట్లు గుర్తించడంతో ఇది భూమిపై ఎటువంటి ప్రభావం చూపుతుందో అనే విషయం చర్చకు దారితీసింది.

ఇప్పుడు ఏర్పడ్డ భారీ బిలంతో ఇంతకు ముందు సూర్యుడి ఉపరితలంపై కన్పించే ఓ ప్రాంతం కన్పించని స్థితి ఏర్పడిందని నాసా అధ్యయన వివరాలను వైస్‌న్యూస్ పత్రిక తెలిపింది. సూర్యుడిలో ఏర్పడ్డ భారీ బిలంతో జియోమాగ్నటిక్ తుఫాన్లు తలెత్తుతాయని అమెరికాకు చెందిన సముద్ర వాతావరణ పరిశోధనల విషయాల అధికారిక సంస్థ ఎన్‌ఒఎఎ హెచ్చరికలు వెలువరించింది. ఇప్పుడు ఏర్పడ్డ బిలంతో భూమి వైపు గంటకు 2.9మిలియన్ కిలోమీటర్ల వేగంతో సౌరగాలులు వీస్తున్నాయి. ఇవి భూమిని వచ్చే శుక్రవారం తాకుతాయని సైంటిస్టులు విశ్లేషించారు.

సౌర వాయువుల ప్రభావం భూమిపై ఏ విధంగా ఉంటుంది? ఏదైనా అవాంఛనీయ పరిస్థితి నెలకొంటుందా? తీవ్రపరిస్థితి ఉంటే తట్టుకునేందుకు ఏమి చేయాలి? అనే విషయాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. సూర్యుడి నుంచి బాగా వేడెక్కిన కణజాలాలు నిరంతర ప్రక్రియగా భూమివైపు దూసుకువస్తే దీనితో భూఊ అయస్కాంత క్షేత్రంపై ప్రభావం పడుతుంది. దీనితో భూమిపై పలు పరిణామాలు సంభవించవచ్చు. ప్రత్యేకించి శాటిలైట్లు, మొబలై ఫోన్లు , జిపిఎస్‌పై ప్రభావం పడుతుంది. ఈ నెల 23వ తేదీనే నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (ఎస్‌డిఒ) నిపుణుల బృందం సూర్యుడి కరోనాలో భారీ బిలం ఏర్పడిన విషయాన్ని గుర్తించింది.

ఇప్పటికే పలు రకాల పర్యావరణ, వాతావరణ మార్పులతో భూమిపై పలు రకాల ప్రభావాలు పడుతున్న దశలోనే ఇప్పుడు భూమికి ఈ సూర్యుడి బిలం నుంచి వెలువడే వాయువులతో ఏర్పడే ముప్పు ఎటువంటిదనేది కీలక ప్రశ్న అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News