- Advertisement -
నాగోబా జాతరకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర శుక్రవారం అర్ధరాత్రి మెస్రం వంశీయులు సంప్రదాయ పూజలతో వైభవంగా ప్రారంభమైంది. దర్శ నానికి భక్తులు బారులు తీరారు. ఆలయంలో మెస్రం వంశీయులు సంప్రదాయ పూజలు చేస్తున్నారు. జాతరకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
తెలంగాణరాష్ట్ర పండుగగా నాగోబా జాతర గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఈ జాతర ఫిబ్రవరి 15వ తేదీ వరకు జరగనుంది. నాగోబా జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. కాగా, ప్రతి ఏటా పుష్యమాసం అమావాస్య రోజు అర్ధరాత్రి ఈ జాతర ప్రారంభమవుతుంది.
- Advertisement -