Monday, January 27, 2025

కార్తీక సోమవారం.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు

- Advertisement -
- Advertisement -

కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. దీంతో భక్తులతో పలు శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. కీసర, యాదగిరి గుట్ట, వేములవాడ రాజన్న, కురుమూర్తితోపాటు తెలంగాణలోని పలు శైవక్షేత్రాలకు ఆధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరోవైపు, శ్రీశైలానికి భారీగా భక్తులు చేరుకుంటున్నారు.

ఒకరోజు ముందుగానే ఆదివారం శ్రీశైలంకు వెళ్లేందుకు వచ్చిన భక్తులతో ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నిన్న సాయంత్రం సాక్షి గణపతి ఆలయం నుంచి ముఖద్వారం వరకు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఇవాళ శ్రీశైలం భక్తలతో కిటకిటలాడుతోంది. పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి.. స్వామివారి దర్శించుకుంటున్నారు. అయితే, పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు 6 గంటల సమయం పడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News