- Advertisement -
కొత్త సంవత్సరం 2025 వచ్చేసింది.. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన యాదగిరిగుట్ట, కీసర, వేములవాడ రాజన్నలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు.
ఇక, హైదరాబాద్ నూ పలు ఆలయాల్లో రద్దీ నెలకొంది. ఇక, ఎపిలోని శ్రీశైల, విజయవాడ కనకదుర్గ, తిరుమల, సింహాచలం, అన్నవరం వంటి ప్రముఖ ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. ఆలయాలను సందర్శించి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
- Advertisement -