Wednesday, January 22, 2025

ల్యాండ్ పార్శిల్స్‌కు భారీ డిమాండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని 34 ల్యాండ్ పార్శిల్స్ (స్ట్రే బిట్స్)కు డిమాండ్ నెలకొంది. ప్రభుత్వ ఆదేశాలకు లోబడి రంగారెడ్డి జిల్లాలోని ఆరు మండలాల పరిధిలోని 16 ల్యాండ్ పార్శిల్స్, సంగారెడ్డి జిల్లాలోని మూడు మండలాల పరిధిలోని 10 ల్యాండ్ పార్శిల్స్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలోని 8 ల్యాండ్ పార్శిల్స్‌ను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) ఈ నెల 22వ తేదీన ఆన్‌లైన్ వేలం (ఈ- యాక్షన్) ద్వారా విక్రయించనుంది. ఈ ప్రక్రియలో భాగంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిధిలోని 16 ల్యాండ్ పార్శిల్స్ అమ్మకాలపై హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో బేగంపేట్ టూరిజం ప్లాజా హోటల్‌లో నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశానికి భారీ ఆదరణ లభించింది.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా….
హెచ్‌ఎండిఏ ఎస్టేట్ ఆఫీసర్ (ఈఓ) బి.కిషన్ రావు ప్రీబిడ్ మీటింగ్‌కు హాజరైన బిడర్లు, డెవలపర్లకు ల్యాండ్ పార్శిల్స్ (స్ట్రే బిట్స్) విక్రయానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టిసి ప్రతినిధి అనురాగ్ ఆన్‌లైన్ వేలం పద్ధతులను, నియమ నిబంధనలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. వేలం ద్వారా కొనుగోలు చేసిన ల్యాండ్ పార్శిల్స్ వారి ఆర్థిక అంశాలకు లోబడి రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు బ్యాంకర్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. ప్రీ బిడ్ సమావేశంలో ల్యాండ్ పార్శిల్స్‌పై ఔత్సాహిక వేత్తలు అడిగిన ప్రశ్నలకు హెచ్‌ఎండిఏ ప్లానింగ్, ఇంజనీరింగ్, అకౌంట్స్ అధికారులు సమాధానాలు ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News