Wednesday, January 22, 2025

2030నాటికి దేశంలో పాలు మాంసానికి భారీడిమాండ్

- Advertisement -
- Advertisement -

2030నాటికి దేశంలో పాలు మాంసానికి భారీడిమాండ్ నాబార్డు అధ్యయన నివేదిక

Huge demand for milk and meat in country

 

మనతెలంగాణ/హైదరాబాద్:  కోవిడ్ పరిస్థితుల అనంతరం ప్రజల ఆహారపు అలావాట్లలో వస్తన్న మార్పుల నేపధ్యంలో దేశంలో 2030నాటికి పాలు మాంసం ఉత్పత్తులకు భారీగా డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నట్టు నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించింది. అంతే కాకుండా పెరుగుతున్న జనాభా కూడా ఇందుకు ఒక కారణంగా తెలిపింది. గత మూడు దశాబ్ధాల నుంచి దేశంలో జానాభా వృద్ధిరేటు 1.57శాతంతో పోలిస్తే పట్టణ జనాభా వృద్ధిరేటు 2.64శాతం ఉన్నట్టు నివేదిక తెలిపింది. దేశ జనాభాలో మూడింట ఒక వంతు నగరాలు , పట్టణ ప్రాంతాల్లోనే నివాసం ఉంటున్నారు.

ఈ ప్రభావంతో ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. గత రెండు దశాబ్ధాలుగా పట్టణాల్లో తలసరి పాలు , పాల ఉత్పత్తుల వినియోగం 10శాతం పెరిగినట్టు నాబార్డు నివేదిక వెల్లడించింది. గుడ్ల వినియోగం 13శాతం , మాంసం, చేపల వినియోగం 25శాతం పెరిగిందని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో పాలు , పాల ఉత్పత్తులు , మాంసం ,చేపల వినియోగం కూడా పట్టణ ఆహారపు అలవాట్లతో పోటీ పడుతున్నట్టు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో గుడ్ల వినియోగం వేంగంగా పెరుగుతూ 45.5శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. 2030నాటికి దేశంలో పాల డిమాండ్ 65.2శాతానికి, మాంసం డిమాండ్ 75.5శాతానికి , గుడ్ల డిమాండ్ 65.7శాతానికి , చేపల డిమాండ్ 75శాతానికి పెరిగుతుందని నాబార్డు అధ్యయన నివేదిక అంచనా వేసింది.

పశుపోషణలో మహిళలే కీలకం :

దేశంలో ప్రత్యేకించి వ్యవసాయరంగంలో పంటలసాగుకు ధీటుగా పశుపోషణలో మహిళలే కీలకంగా మారారు. పశుపోషణ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇంటిఅవరాలు సరిపడే విధంగా వినియోగిస్తూ బడ్జెట్ సూత్రాన్ని వంటబట్టించుకుంటున్నారు. తద్వారా మహిళా సాధికారతను చాటుతున్నారు. కుంటుబ జీవన విధానాలను పేదరికం నుంచి బయటపడేటంలో కూడా మహిళలు కుంటుంబ నిర్వహణ యాజమాన్య బాధ్యతలను సమర్ధవంతంగ నిర్వహించగలుగుతున్నట్టు నాబార్డు అధ్యయ నివేదికలో బయటపెట్టింది. కుటుంబ బడ్జెట్ నిర్వహణలో ప్రధానంగా పిల్లలకు పోషకాహారం అందజేయటం , ఆరోగ్యసంరక్షణ, విద్యకు ప్రధాన్యత ఇవ్వటంలో మహిళలు తమ కుటుంబ భవిష్యత్తునే కాకుండా దేశ భవిష్యత్తుకు కూడా దోహదపడుతున్నట్టు నివేదిక వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News