Friday, December 20, 2024

తొర్రూర్ లే ఔట్‌కు భారీ డిమాండ్

- Advertisement -
- Advertisement -
Huge demand for Thorrur Layoutమల్టీపుల్ యూజ్ జోన్ పరిధిలోకి 117 ఎకరాలు
విజయవంతమైన ప్రీ బిడ్ మీటింగ్
సమావేశానికి 300 మంది ఔత్సాహికుల హాజరు
లే ఔట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను వివరించినహెచ్‌ఎండిఏ చీఫ్ ఇంజినీర్ బిఎల్‌ఎన్ రెడ్డి

హైదరాబాద్: ఒకే చోట వెయ్యి ప్లాట్లతో రూపుదిద్దుకుంటున్న తొర్రూర్ లే ఔట్‌కు డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) ఆధ్వర్యంలో 117 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల మౌలిక సదుపాయాల (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్)తో తొర్రూర్ లే ఔట్ ఏర్పాటు అవుతోంది. 117 ఎకరాల భూములను మల్టీపుల్ యూజ్ జోన్‌లోకి మారుస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తొర్రూర్‌లో తొలివిడతగా హెచ్‌ఎండిఏ 30 ఎకరాల్లో 223 ప్లాట్లను అభివృద్ధి చేసి మార్చి మూడోవారంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్‌టిసీ ద్వారా ఆన్‌లైన్ వేలం (ఈ-ఆక్షన్) పద్ధతిలో అమ్మకాలు జరపనుంది.

223 ప్లాట్ల విక్రయాలకు వీలుగా

తొర్రూర్ లే ఔట్‌లో 223 ప్లాట్ల విక్రయాలకు వీలుగా శుక్రవారం లే ఔట్ స్థలం (సైట్)లో హెచ్‌ఎండిఏ ఉన్నతాధికారులు ప్రీబిడ్ సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు మూడువందల మంది వరకు ఔత్సాహికులు ప్రీబిడ్ మీటింగ్‌కు హాజరై తమ ఆలోచనలను పంచుకోవడంతో పాటు తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ఆన్‌లైన్ పద్ధతిలో ఏ విధంగా ఈ- వేలంలో భాగస్వామ్యం కావాలన్న అంశంపై ఎంఎస్‌టిసి అడిషనల్ జనరల్ మేనేజర్ రేణు పురుషోత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పిపిపి) ద్వారా వివరించారు. హెచ్‌ఎండిఏ లే ఔట్‌లో ప్లాట్లను కొనుగోలు చేసిన వారికి రుణాలు మంజూరు చేయడానికి వీలుగా ఇండియన్ ఓవర్‌సిస్ బ్యాంక్ (ఐఓబి), కొటక్ మహేంద్ర బ్యాంక్ అధికారులు ప్రీబిడ్ మీటింగ్ వద్ద ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటుచేసి సమావేశానికి హాజరైన వారికి లోన్ ఇచ్చే పద్ధతులను వివరించారు.

రెండు సంవత్సరాల్లో మౌలిక వసతులు: బిఎల్‌ఎన్ రెడ్డి

హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో తొర్రూర్ లే ఔట్‌లో చేపట్టనున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల గురించి చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి వివరించారు. లే ఔట్‌లోని అంతర్గత రహదారులు, ఫుట్‌పాత్‌లు, పచ్చదనం (గ్రీనరీ), విద్యుత్ సబ్ స్టేషన్, విద్యుత్ లైన్లు, స్ట్రీట్ లైట్లు, సివరేజీ సిస్టం వంటి కనీస వసతులను రెండు సంవత్సరాల్లో హెచ్‌ఎండిఏ పూర్తి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి హెచ్‌ఎండిఏ సెక్రటరీ పి.చంద్రయ్య, ఓఎస్డీ ఎం.రాంకిషన్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గంగాధర్, ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ వెంకటాచారి, హెచ్‌ఎండిఏ సూపరింటెండెం టింగ్ ఇంజనీర్ పరంజ్యోతి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్పారావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దీపక్ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News