Saturday, December 21, 2024

తిరుమల వెంకన్న దర్శనానికి 12 గంటల సమయం..

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తిక పున్నం సందర్భంగా తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. ఇక, గురువారం శ్రీవారిని 56,711 మంది భక్తులు దర్శించుకుని ముక్కులు తీర్చుకున్నారు. 20,639 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టిటిడి హుండీ ఆదాయం రూ. 3.64 కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు.

కాగా, పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆధ్వర్యంలో నవంబరు 18వ తేదీన తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇందుకోసం పరిపాలన మైదానంలో కార్తీక దీపోత్సవాలు నిర్వహించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News