Tuesday, November 5, 2024

కార్తీక మాసం ఎఫెక్ట్.. తిరుమలకు పోటెత్తిన భక్తులు

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. గతవా కార్తికమాసం సందర్భంగా తిరుమలలో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అదివారం కావడంతో తిరుమలకు పోటెత్తారు.ఈ క్రమంలో శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల వరకు భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు దాదాపు 18 గంటల సమయం పడుతోంది. ఇక, శనివారం 88,076 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి 33, 236మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

కాగా..నవంబర్ 5న నాగులచవితి సందర్భంగా శ్రీవారికి పెద్దశేష వాహనసేవ నిర్వహించనున్నారు. 8న పుష్పయాగానికి అంకురార్పణ, 9న మలయప్పస్వామికి పుష్పార్చన జరగనుంది. ఈనెల 13న సూర్యోదయానికి ముందు తిరుమాడ వీధుల్లో శ్రీదేవి భూదేవి సమేతుడైన ఉగ్రశ్రీనివాసమూర్తి ఊరేగనున్నారు. 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా గరుడు వాహనంపై శ్రీవారి దర్శనం ఇవ్వనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News