Sunday, January 19, 2025

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. కోద్ది రోజులుగా సాదరాణముగా భక్తుల రాక ఉండగా దసరా సెలవుల నేపథ్యంలో స్వామి వారి దర్శనార్ధం తరలివచ్చె భక్తుల రద్దీ పెరిగింది. శనివారం తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు అర్చన, అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనార్ధం అనుమతి ఇచ్చారు. పిల్లాపాపలు, కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో జరిగిన సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, నిత్యబ్రహ్మోత్సవం, వెండి జోడి సేవ, స్వర్ణ పుష్పార్చన, సత్యనారాయణస్వామి వ్రత పూజలలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని కూడా భక్తులు దర్శించుకొని తరించారు. ఆలయంలో జరిగిన నిత్యపూజల్లో పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు.

శ్రీలక్ష్మీనరసింహుడి నిత్యరాబడి
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యరాబడి రూ.26,63,605 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.1,53,900, బ్రేక్ దర్శనం ద్వారా రూ.2,12,700, వ్రతపూజల ద్వారా రూ.72,800, వీఐపీ దర్శనం ద్వారా రూ.1,20,000, కొండపైకి వాహనాల అనుమతి ద్వారా రూ.4,00,000, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.78,980, ప్రసాద విక్రయం ద్వారా రూ.7,50,980తో పాటు వివిధ శాఖలు, పాతగుట్ట ఆలయం నుంచి ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
యాదాద్రీషుడికి బంగారుపూత వెండి కిరీటాలు బహుకరణ
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి 3 వెండి కిరీటాలను భక్తులు సమర్పించారు. 950 గ్రాముల బరువుతో గల బంగారు పూతతో తయారు చేయించిన 3 వెండి కిరీటాలను కాకుమాను శ్రీనివాసరాజు దంపతులు స్వామి వారికి సమర్పించారు. శనివారం ఆలయ అధికారులకు వెండి కిరీటాలు భక్తుడు అందజేశారు.

రామలింగేశ్వరాలయంలో ఘనంగా శరన్నవరాత్రోత్సవాలు
యాదాద్రి కొండపైన కొలువైన శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి, ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా అష్టోత్తరం, శ్రీలలితాసహస్రనామార్చన, పారాయనములు, జపములు, కుంకుమార్చనను అర్చకులు వేదోక్తంగా అర్చకులు నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల అలంకార విశిష్టతను భక్తులకు అర్చకులు వివరించారు. ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఈనెల 28న చంద్రగ్రహణం
ఈనెల 28న చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని శరత్‌పూర్ణిమ కార్యక్రమాన్ని శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవ కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 27వ తేదీ రాత్రి 7 గంటల నుంచి నివేదన వరకు శరత్‌పూరిణమ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News