Friday, November 22, 2024

మేడారానికి భారీగా భక్తజనం..

- Advertisement -
- Advertisement -

 ఎక్కడికక్కడే ట్రాఫిక్ జాం
 మేడారం పనులను పరిశీలించిన కలెక్టర్
మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: తెలంగాణ కుంభమేళా సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రారంభం కాకముందే ఆదివారం తల్లుల దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచే వాహనాల రద్దీ భారీగా పెరిగి ఎక్కడికక్కడే ట్రాఫిక్ జాం అయింది. ఆదివారం ఒక్కరోజే పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనానికి రావడం సంచలనం రేకెత్తిస్తుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో భక్తులు లక్షల సంఖ్యలో తరలిరావడం ఆందోళన కలిగిస్తుంది. మేడారం జాతర ఇంకా ప్రారంభం కాకపోవడంతో అధికారులు జాతర ప్రదేశాల్లో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు కొవిడ్ నిబంధనలు లేకపోవడం వల్ల కిక్కిరిసిన జనంతో తల్లులకు మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఆదివారం సెలవు కావడం నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు లక్షలాదిగా తరలిరావడం మేడారం అడవీ అంతా జనారణ్యంగా మారిపోయింది. ఎక్కడా చూసినా టెంట్లు, శిబిరాలతో కూడిన దృశ్యాలే కనిపించాయి.

భారీ ఎత్తున కోళ్లు, మేకలు తల్లులకు బలిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సమయం దగ్గర పడడం వివిధ ప్రాంతాల భక్తులు ముందుగానే పోయిరావాలనే ఉద్దేశంతో అధికంగా తరలివస్తున్నారు. ఆదివారం నుంచి రాత్రింబవలు భక్తులు ప్రత్యేక వాహనాల్లో తరలివెస్తున్నారు. జాతరకు ఇరవై రోజులు సమయం ఉన్నప్పటికి లక్షలో సంఖ్యలో భక్తులు రావడం ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో జాతర ఏర్పాట్లలో ఉన్న అధికారులకు పనులు చేయడ ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉండగా.. నత్తనడకన కొనసాగుతున్న పనులను వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆదివారం క్షేత్రస్థాయి పర్యటన చేసి పనులను పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

Huge devotees Reached to Medaram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News