మల్యాలః కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో కుటుంబ సమేతంగ భక్తులు అంజన్నను దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. ఏఇఓ బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెంట్ సునీల్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఆలయ డైరెక్టర్ కొంక నర్సయ్య, తెల్లవరుజాము నుంచి ఆలయంలో క్యూలైన్ వద్ద సేవ చేయడంతో పలువురు అభినందించారు.
ఇది ఇలా ఉండగా, వాహనాలను ఇష్టానుసారంగా కొండపైకి వదలడంతో వై జంక్షన్ వద్ద ఉదయం ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కాగా, జగిత్యాల జిల్లా బిజెపి నాయకులు డాక్టర్ శైలేందర్‌రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్‌లు వేర్వేరుగా మాట్లాడుతూ కొండగట్టుకు మాస్టర్ ప్లాన్ రూపొందించి, సిఎం కెసిఆర్ ప్రకటించిన 500 కోట్ల పనులను ఎలక్షన్ లోపే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. భక్తులను ఆలయం ముందు నుంచి దర్శనంకు అనుమతించాలని అధికారులను కోరారు.