యాదాద్రి: శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ స్వామివారి దర్శనం కోసం ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు అర్చన, అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు. పిల్లాపాపలు, కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయంలో జరిగిన సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, నిత్య బ్రహ్మోత్సవం, వెండి జోడి సేవ, స్వర్ణపుష్పార్చన, సత్యనారాయణస్వామి వ్రత పూజలలో భక్తులు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. యాదాద్రి కొండపైన కొలువైన శ్రీపర్వతవర్ధినీ సమేత రా మలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని కూడా భక్తులు సందర్శించి స్వామి వారిని దర్శించుకొని తరించారు. అనుబంధ ఆలయమైన శ్రీపాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయంలో జరిగే నిత్యపూజలలో పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు.
ఏకదశి లక్షపుప్పర్చన……
ఏకదశి పురస్కరింయుకొని యాదాద్రి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ గావించిన అర్చకులు లక్ష పుష్పర్చన పూజను వైభవంగా నిర్వహించారు. వివిద రంగురంగుల పరిమాలాలు విరజిలు పువ్వులతో అమ్మవారికి లక్ష పుష్పర్చన పూజలను అర్చకులు శాస్రోక్తంగా నిర్వహించగా భక్తులు దర్శించుకొని పూజలో పాల్గొన్నారు.
ఘనంగా కొనసాగుతున్న ధనుర్మాసోత్సవాలు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున కొండపైన ఆలయ ముఖ మండపంలోని ఉత్తరభాగం హాల్‌లో తిరుప్పావైని వేదోక్తంగా అర్చకులు నిర్వహించారు. ఆలయ అర్చకులు ధనుర్మాస విశిష్టతను భక్తులకు వివరించారు.
స్వామి వారికి నిత్యరాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యరాబడి రూ.43,61,283 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం ద్వారా రూ.19,29,400, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.2,22,350, బ్రేక్ దర్శనం ద్వారా రూ.3,79,800, వీఐపీ దర్శనం ద్వారా రూ.4,35,000, కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ.5,00,000, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,14,948, కల్యాణకట్ట ద్వారా రూ.1,08,000తో పాటు ఆలయంలోని తదితర శాఖలు, పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం నుండి ఆదాయం సమకూరినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
యాదాద్రీశుడికి వెండి పూలబుట్ట..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి కిలో బరువు గల వెండి పూలబుట్టను ఒమేఘా ఆస్పత్రి యాజమాన్యం టి.శ్రీకాంతరావు సమర్పించారు. ఆదివారం ఆయన స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులకు వెండి పూలబుట్టను అందజేశారు.
యాదాద్రీశుడి సేవలో పలువురు ప్రముఖులు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని కర్ణాటక మెడికల్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డిలు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాన్ని అందజేశారు.