Wednesday, January 22, 2025

భద్రాది రాముడికి రూ.2.20 కోట్ల ఆదాయం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భద్రాది రాముడికి గడిచిన 84 రోజుల్లో హుండీ ద్వారా రూ.2.20 కోట్ల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. నవంబర్ 11 నుంచి బుధవారం వచ్చిన హుండీ ఆదాయాన్ని చిత్రకూట మండపంలో లెక్కించారు.

నగదుతో పాటు 250 గ్రాముల బంగారం, 2 కిలోల వెండితో పాటు కొంత విదేశీ కరెన్సీ కానుకలుగా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.ముక్కోటి ఏకాదశి, జనవరి 1, 2 తేదీల్లో భక్తులు భారీగా తరలి రావడంతో ఆదాయం పెరిగిందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News