Monday, December 23, 2024

మేడారం మహాజాతరకు పోటెత్తిన భక్తులు..

- Advertisement -
- Advertisement -

ములుగు: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు భక్తులు పోటెత్తారు. ఈనెల 16 నుంచి మహాజాతర మొదలుకానున్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులతో మేడారం కిటకిటలాడుతోంది. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో క్యూ లైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు మొక్కుకున్నట్లుగా నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పిస్తున్నారు. కరోనా మూడో ముప్పు, ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల మేడారంలో దుకాణాలను మూసివేశారు. బెల్లం, మంచినీళ్లు, పసుపు, కుంకుమ వంటి అత్యవసరమైన వస్తువులు మాత్రమే విక్రయిస్తున్నారు. భక్తులంతా మాస్కు ధరించి భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Huge Devotees Visit Medaram Jatara

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News