Sunday, October 6, 2024

ఆదివారం తిరుమల వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు..

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూలైన్‌లో భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది.

ఇక, శనివారం శ్రీవారిని 75,552 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి 35,885 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.54కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News