- Advertisement -
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. నిన్న తిరుమల శ్రీవారిని 27,021 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 15,007 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.2.41 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. అక్టోబర్ 7నుండి 15వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేకపోతే నెగెటీవ్ రిపోర్టు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరారు.
Huge devotees visit Tirumala Temple
- Advertisement -