తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. రెండేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఆలయానికి భారీగా భక్తులు క్యూ కడుతున్నారు. సోమవారం తిరుమల శ్రీవారిని 62,956మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 32,837 మంది భక్తులు శ్రీవారికి తమ తలనీలాలు అర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.4.13కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. తిరుపతిలోని భూదేవి, శ్రీనివాసం, గోవిందరాజ సత్ర సముదాయాల వద్ద సర్వదర్శన టోకెన్లను టీటీడీ కేటాయిస్తుంది. ప్రస్తుతం నడిచి తిరుమలకు వెళ్లే వారికోసం అలిపిరి మార్గం అందుబాటులో ఉంది…. శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు అందుబాటులో లేదు. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ కోవిడ్ సర్టిఫికెట్ నెగిటివ్ సర్టిఫికెట్.. లేకపోతే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకొని ఉండాలని భక్తులకు టిటిడి అధికారులు సూచించారు.
Huge Devotees Visit Tirumala Temple