Thursday, December 26, 2024

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

వేములవాడ: ప్రసిద్ద పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వేకువ జామునుండే భక్తులు పవిత్ర ధర్మగుండంలో స్నానమాచరించి, స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకోవడానికి క్యూలైన్‌లో వేచి ఉండి, కోడెమొక్కు చెల్లించుకున్నారు.

పుట్టు వెంట్రుకలు సమర్పించి, అభిషేకాలు జరిపించుకుని, కుంకుమార్చన నిర్వహించుకుని, శివకళ్యాణం, చంఢీయాగం, అన్నపూజలు, పల్లకి సేవ, పెద్ద సేవ లాంటి పూజ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. భక్తులు గంటల తరబడి లైన్‌లో నిలబడి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్టా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News