- Advertisement -
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్నఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ఉండటంతోపాటు సోమవారం కావడంతో రాజన్న ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు రాజన్న దర్శనం కోసం భారీగా చేరుకున్నారు.
పుణ్య స్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలో ద్వీపాలు వెలిగించారు. అయితే, పెద్ద ఎత్తున భక్తులు రావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. దీంతో రాజన్న దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. ఆలయంలో కోడెమొక్కులు చెల్లించేందుకు కూడా భక్తులు భారీగా వేచి ఉన్నారు. కాగా, భక్తుల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
- Advertisement -