Saturday, January 11, 2025

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

వేములవాడ ః దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో పాటు సమ్మక్క జాతర ముందు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూలైన్‌లో కిక్కిరిసిపోయారు. దీంతో దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. భక్తుల రద్దీ దృష్టా గర్భాలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News