Tuesday, January 7, 2025

యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: శ్రీలక్ష్మినరసింహ స్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో యాదాద్రి కిటకిటలాడింది. ఆదివారం కావడంతో స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు.

శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే యాదాద్రి కొండకు తరలి స్వామిని దర్శించుకుంటున్నారు. శ్రీవారి ఆలయంలో జరుగు నిత్యపూజలలో భక్తులు పాల్గొని తమ మోక్కుబడులను చెల్లించుకున్నారు. కాగా, స్వామివారి ఉచిత దర్వనానికి దాదాపు రెండు గంటలకు పైగా సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుంది.

Also Read: జూన్ 26న టిటిడి గదుల కోటా విడుదల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News