Saturday, February 22, 2025

యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్ధం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు రెండున్నర గంటల సమయం పడుతుంది.

ఇక, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి కుటుంబ సభ్యులతో, పిల్లాపాపలతో కలిసి వచ్చిన భక్తులు శ్రీ లక్ష్మీనరసింహుని దర్శనంతో పాటు, నిత్యకల్యాణం, సువర్ణ పుష్పార్చన, సుదర్శన నారసింహ హోమం, వెండి జోడి సేవ, శ్రీసత్యనారాయణ వ్రతపూజలలో పాల్గొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News